భూసార పరీక్ష ఫలితాలు తెలుసుకునే విధానం

https://thecropexpres.blogspot.com/


కార్డు లో ఇచిన ఫలితాలు ఎలో చూడాలో తెలుసుకుందాం.
భూసార ఫలితాలు ఆధారంగా గనక ఎరువుల యాజమాన్యం చేపడితే తద్వారా మనకి సాగు
ఖర్చు తగ్గడం భూసారాన్ని సక్రమంగా అభివృద్ధి చేసుకోవడం వేసే పంటలు మంచి
దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

మట్టి నమూనా తీసే విధానం తెలుసుకోవడం కొరకు ఇక్కడ నొక్కండి.

చాలామంది రైతులకు మట్టి పరీక్షలు చేయించాలని తెలిసిన వచ్చిన ఫలితాలను ఎలా అనువదించుకోవాలో దాని అనుగుణంగా నేలలను ఎలా సరిదిద్దుకోవాలోఅంతు పట్టదు. 

ఇది చదివితే మీకు పూర్తిగా అర్థం అవుతుంది.

మట్టిలో పలు అంశాల గురించి భూసార పరీక్షలు మనకు తెలుస్తాయి
  • ఉదజన సుచ్చిక (PH) 
  • లవణ సాంద్రత (EC) 
  • సేంద్రియ కర్బనం (OC) 
  • నత్రజని (N) 
  • భాస్వరం (P) 
  • పొటాషియం (K) 
  • సుల్ఫర్/ గంధకం (S)
  • జింక్ (zn)
  • బోరాన్ (B) 
  • కాపర్ (Cu) 
  • ఇనుము (Fe) 

 ఉదజన సుచ్చిక (PH)

అందులో మనకు భూమి గుణం ఎలా ఉందో తెలుస్తుంది ఆమ్ల గుణం, క్షౌర 
గుణమా, చవుడు గుణమా  అని చెప్తుంది.
  • 6.5 కన్నా తక్కువ ఉందంటే దాని అర్థం ఆ భూములు ఆమ్లా (acidic) భూములు అని అర్థం చేసుకోవాలి.
       అక్కడ కొన్ని పోషక లోపాలు వస్తాయి అక్కడ కొన్ని పంటలు సక్రమంగా
       పండవు తప్పనిసరిగా సున్నం వేసుకుంటే గనక ఆమాల గుణం చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.
  • 6.5 నుంచి 7.5 మధ్యలో ఉదజన సుచ్చిక  అంటే ఆ భూమి తటస్థ భూమి అని అర్ధం.
       అంటే అందులో అన్ని రకాల పోషకాలు సురక్షితంగ లబ్యం అవుతాయ.
  • 8.0 కంటే ఎక్కువ ఉంటె దాన్ని క్షౌర భూమి అంటారు (alkali)
       దని వళ్ళ  వేసినటువంటి పోషకాలు సక్రమంగా అందవు.
       వేసవిలో గనక చూస్తే తెల్లగా పెచ్చులు కట్టేసినట్టు కనిపిస్తుంది.

దీనిని నివారించుకోవడానికి మనం జిప్సం కనీసం 200 kg వెయ్యాలి పంట వేసే ముందు మనం దుక్కి గాని దమ్ము చేసేటప్పుడు అప్పుడు జిప్సం వేసుకొని నీరు నిలబెట్టి నీరుగానికి వదిలేస్తే క్షౌర గుణo తగ్గుతుంది.

లవణ సాంద్రత(EC)

అలాగే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే లవణ సాంద్రత అది 0.4 కన్నా లోపు ఉంటేనే అది మంచి భూమిగా మనం చెప్పుకుంటాం.

సేంద్రియ కర్బనం(OC) 

  • 0.5% కన్నా తక్కువ ఉంటే అది తక్కువ స్థాయిలో కార్బన్ ఉందని అర్థం చేసుకోవాలి. 
  • 0.5 నుంచి 0.75 ఉంటది  మద్యస్థంలో ఉందని అర్థం.
  • 0.7.5% కంటే ఎక్కువ ఉంటే అది అధికంగా ఉందని అర్థం.
     మన భూమిలో కర్బను చాలా బాగుందంటే ఆ భూముల నుంచి మంచి దిగుబడినిస్తాయని ఆశించవచ్చు. 
     సేంద్రియ కర్బనం బాగా ఉంటేనే మనం వేసిన పోషకాలు అన్ని కూడా మొక్క సక్రమంగా తీసుకోగలదు.
     తక్కువ ఉందంటే మనం ఆ భూములకి ఎక్కువ సేంద్రియ ఎరువులను అందించాల్సిన అవసరం ఉంది. 
  • భూమికి పది నుంచి 15 టన్నుల పశువులు గెత్త వేయండి లేదంటే పచ్చి రొట్టె ఎరువు తప్పనిసరిగా వేసుకోండి లేదా మేకలు గతం చెరువుగతం వేయాలని సిఫార్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
 
స్థూల పోషకాలు నత్రజని గానీ భాస్పరం గాని పొటాస్ గాని ఇవి ఎంతవరకు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇవ్వటం జరుగుతుంది.

నత్రజేని (N)

  • హెక్టార్ కి 280 కేజీల కన్నా లోపల ఉంటే నత్రజేని తక్కువ ఉంది. 
  • 280 నుంచి 500 వరకు ఉందనుకుంటే అది మధ్యస్థ భూమి. 
  • 560  దాటి కనుక చూపిస్తుంటే భూమిలో నత్రజని అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి.

 భాస్పరం(B) 

  • 10 కిలోల కన్నా లోపు ఉందంటే అది ఆల్ఫాముగా ఉంది అంటే తక్కువగ ఉంది అని అర్ధం . 
  • 10 -25 కేజీల మధ్యలో ఉందంటే మనకి మధ్యస్థగ ఉన్నటువంటి భూములుగా అర్థం చేసుకోవాలి. 
  • అదే  25 కేజీలు పైబడి మనకు ఇచ్చారంటే మన భూముల్లో అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి.

 పొటాషియం(P)  

  • హెక్టార్ కి 110 కిలోల కన్నా తక్కువ ఉంటే తక్కువ స్థాయిలో పొటాషియం ఉంది అని అర్ధం.
  • అదే గనక 110 నుంచి 250 వరకు ఉందంటే అది మద్యస్థ భుములు.
  • 250 పైన గనక మన పొటాషియం చూపిస్తున్నారు అంటే అది బాగా అధికంగా ఉంది పొటాషియం అర్థం.
  1. మీ భూసార పరీక్ష ఫలితాలు గనుక తక్కువ స్థాయిలో మీ భూమిలో పోషకాలు ఉన్నాయంటే ఒక 25% అదనంగా ఎరువులు అందిస్తే పంటలు అధికంగ పెరిగే అవకాసం ఉంటంది.  
  2. అదే మధ్యస్తం గా ఉంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన ఎరువులు ఇస్తే సరిపోతుంది.  
  3. అధికంగా ఉన్నట్టు రిపోర్ట్ వస్తతే 20-25 % తగ్గించి వేసుకోవాలని అర్థం.
దీనివలన ఖర్చులు తగ్గడమే కాకుండా మనకి దిగుబడి కూడా పెరుగుతుంది భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి.

సూక్ష్మ పోషకాలు 

అన్ని కూడా  PPM (పార్ట్శ్ పర్ మిలియన్) అంటే ఒక మిలియన్ భాగాలకి ఎంత శాతం లో ఉన్నాయో మనకి ఇస్తారు.

    జింక్ (Zn)

  • 0.7 పిపియo  ఉంటే గనక తక్కువ.
  • 0.7 - 1.2 పిపిఎంలు ఉందంటే అది మద్యస్థoగ ఉందని అర్ధం. 
  • 1.2 ఎక్కువుంటే జింకు లభ్యత బాగా ఉందని అర్థం చేసుకోవాలి.
ఒకవేళ తక్కువగా ఉన్నట్టు వస్తే  మనం ఎకరానికి 20 కేజీలు జింక్ సల్ఫేట్ 
పైపాటిగా వేసుకోవాలి.

సుల్ఫర్/ గంధకం (S)

  • 10 కంటే ఎక్కువ ఉండాలి. 
  • తక్కువగా ఉంటే సల్ఫేట్ సూచించిన మోతాదులో వాడాలి.

ఇనుము(Fe)

  • 4.5 కంటే ఎక్కువ ఉండాలి ఉండాలి. 
  • లేదంటే ఐరన్ సల్ఫేట్ సూచించిన మోతాదు లో వేసుకోవాలి.

బోరాన్(B)

  1. 0.5 కంటే ఎక్కువ ఉండాలి. 
  2. తక్కువగా ఉంటే బోరాక్స్ సూచించిన మోతాదులో వాడాలి.

కాపర్(Cu)

  • 0.2 కంటే ఎక్కువ ఉండాలి. 
  • తక్కువగా ఉంటే కాపర్ ఆక్సైడ్ సూచించిన మోతాదులో వాడాలి.