మట్టి పరీక్ష లేదా భూసార పరీక్ష
భూసార పరీక్ష
వలన లాభాలు
నత్రజేన్ని , ఫోస్పోరం,
పోటాష్ ఇతర సుక్ష్మ పోషకాలు మన నేల లో యెంత శాతం ఉన్నాయో తెలుస్తుంది.
ఎరువుల కర్చు తగ్గుతుంది.
నేలలో వానపములు, ఇతర పంట
ఏడుగుదళ కు కావాల్సిన సుక్ష్మ జీవులు కాపాడవాచు.
భూసార పరిక్ష చేయించుకోవడం వలన భూమిలో లేదా మీరు పండించే పొలంలో మొక్కకు కావలసిన పోషకాలు ఎంత
మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
తగినటువంటి ఎరువులు ఏమేమి వేసుకోవాలని కూడా
సూచించడానికి అవకాశం అనేది ఉంటుంది.
భూసార
పరీక్షకు కావాల్సిన వస్తువులు
గునపం
పార
ప్లాస్టిక్
సంచి
తర్పలిన్ పట్టా
మట్టి నమున సేకరించే సమయం
ఒక పంట వేసే ప్రాంతాల్లో గనక మార్చి నుండి
ఏప్రిల్ మాసంలో అదే రెండు పంటలు
పండించేటువంటి ప్రాంతాల్లో మే నెలలో తీసుకోవాలి.
ఒక పంట వేసే ప్రాంతాల్లో ప్రతి మూడు
నుంచి నాలుగు సంవత్సరాలకి ఒక ఒకసారి పరీక్ష చేయించుకోవాలి.
అదే రెండు పంటలు వేసే ప్రాంతాల్లో ప్రతి మూడు సీజన్లోకి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష అనేది చేయించుకోవాలి.
ఈ మట్టి నమూన అనేది పొలం గట్ల దగ్గర
గాని,
చెట్ల నీడలో గాని,
కాలిబాటల్లో గాని,
ఒకవేళ పొలం తడిగా ఉన్నట్లయితే గనక బురద మనలో గాని,
కంపోస్ట్ పిట్ దగ్గర గాని పెంట కుప్పలు దగ్గర
కూడా మన శాంపిల్ అనేది తీయకూడ
చౌడు ఉన్న నేలలో ఈ చౌడు మట్టిని సాధారణ మట్టితో కలిపి శాంపిల్ గా
తీయకూడదుదు.
మట్టి నమున సేకరించే లోతు
నమున తీసుకునేటువంటి లోతు విషయానికి వచ్చినట్లయితే తక్కువ లోతు వేరువేస్త
కలిగినటువంటి పంటల.
(వరి గాని జొన్న మొక్కజొన్న ఇట్లాంటి పంటలు) 15 సెంటీమీటర్ లోతులో అంటే అర్థడుగులోతులో శాంపిల్ అనేది తీసుకోవాలి.
కొంచెం వేరు వేస్తే లోపలికి వెళ్లేటువంటి పంటలు (పత్తి గాని లేదా ఆముదం కంది) ఒక అడుగు (౩౦ cm) దాక
తెస్కోవాలి.
15 సెంటీమీటర్ లోతులో ఒక శాంపిల్ల
15-౩౦ cm లోతులో ఇంకో నమూనా చౌడు భూమి లో తెస్కోవాలి.
మట్టి నమున సేకరించే
విధానం
- పొలం అంతా కూడా సమానంగా ఉన్నట్లయితే గనక, నేల రంగు గాని దిగుబడి గాని అంత సమానంగా ఉన్నట్లయితే ప్రతి ఐదు ఎకరాలకు ఒక శాంపిల్ చొప్పున తీసుకోవాలి .
- పొలం అంతా కూడా ఒకే రకంగా ఉన్నట్లయితే కనుక 10 నుంచి 12 చోట్ల ఈ మట్టి శాంపిల్ అనేది తీసుకోని ఒక శాంపిల్ గా కలుపుకోవాలి .
- ముందుగా నేలపైన ఉన్నటువంటి చెత్తాచెదారని తెసివయ్యాలి.
- తీసేసిన తర్వాత గునపం సహాయంతో “V” ఆకారం లో గుంత తీసుకొని ఒక వైపు నుంచి పార సహాయంతో మట్టిని ఒక లేయర్ లాగా తీసుకోవాలి.
- తర్వాత ఆ మట్టిలో ఎదన్న రాళ్లు చెత్తాచెదారం లేకుండా చేసుకున్న తర్వాత అంతా కూడా శుభ్రంగా నలగొట్టి మెత్తగా చేసుకోవాలి.
- ఈ మట్టిని ఒక గచ్చు పైన పెట్టుకొని చతురస్రాకారంలో తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత నిలువుగాను అడ్డంగాను గీతాలు తీసుకున్నట్లయితే నాలుగు సమభాగాలు గా అవుతుంది.
- దీన్ని ఒకటి రెండు మూడు నాలుగు అనుకోని నాలుగు భాగాలుగా చేసుకున్నట్లయితే
- ముందుగా ఒకటి, నాలుగు భాగాన్ని తొలగించుకోవాలి తొలగించుకున్న తర్వాత ఇంకా మనకి రెండు భాగాలు మిగులుతాయి.
- ఈ రెండు భాగాలను కూడా మల్ల కలుపుకొని మల్ల చతురస్రాకారంలో మట్టిని పరుచుకోవాలి.
- ఆ తర్వాత ముందు చేసినట్టుగానే నిలువు గాని అడ్డం గాని గీతాలు తీసుకున్నట్లయితే, రెండు, ముడు భాగాలు కనుక తీసేసినట్లయితే సరిపోతుంది .

- ఈ రకంగా అరకిలో మట్టి వచ్చేదాకా చేసుకోవాలి.
- తర్వాత ఈ రకంగా కలెక్ట్ చేసుకున్న శాంపిల్పో ను కవర్లో వేసుకొని దాంతో పాటుగా కొన్ని రైతు యొక్క వివరాలను కలిపి పంపించాలి.
- ఆ వివరాలు ఏంటంటే రైతు యొక్క పేరు గ్రామము మండలము ఫోన్ నెంబరు సర్వే నంబరు దీంతో పాటుగా మూడు సంవత్సరాలుగా వేసినటువంటి పంటలు వివరాలు తర్వాత వేయబోయేటటువంటి పంటలు వివరాలు తారీకు దీంతోపాటుగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే గనక ఆ సమస్య ఏంటి ఒకవేళ గట్టి పోరా లేదా చౌడు ఆ కాగితం పైన పెన్సిల్ సహాయంతో రాసి ఆ కాగితాన్ని ఆ కవర్లో వేసి ల్యాబ్ కి పంపించినట్ల అయతే టెస్ట్ చేయడానికి వీలు అవ్తుంది .
3 నుంచి 6 అడుగులు లోతు లో శాంపిల్ తీసుకోవాలి,
మీటర్ వెడల్పు మిటర్ పొడవు ఉండే విధంగా
రెండు మీటర్ల లోతులో గుంత అనేది తీసుకోవాలి,
తీసుకున్న తర్వాత ప్రతి అడుగు మార్కింగ్
అనేది చేసుకోవాలి ,
చేసుకున్న తర్వాత కింద నుంచి ఒక్కొక్క
అడుగు కూడా మనం మట్టి శాంపిల్ అనేది పొరలాగా తీసుకొని ప్లాస్టిక్ కవర్లో నింపుకొని
కాగితం పైన నమూనా సంఖ్య అనేది రాయాలి.


0 Comments